ADB: నూతన సర్పంచ్, ఉప సర్పంచ్లు సమాజహితం కోసం పాటుపడాలని మథుర లబాన సమాజ్ జిల్లాధ్యక్షులు సాబ్లే అమర్ సింగ్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇటీవల నూతనంగా గెలిచిన పలు గ్రామాలకు చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్లను మథుర లబాన సమాజ్ ఆధ్వర్యంలో సన్మానించి అభినందించారు. రాజకీయాల్లో ఉన్నతంగా రాణించి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు.