NLG: నిడమనూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంకతి సత్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో త్వరలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి, సేవా కార్యక్రమాల గురించి వివరించారు.