WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ కలెక్టర్ డా. సత్య శారద మీడియాతో మాట్లాడారు. జిల్లాలో యూరియా పంపిణీని మరింత పారదర్శకంగా చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలిపారు. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా ‘Fertilizer Booking App’ అందుబాటులోకి రానుందని కలెక్టర్ పేర్కొన్నారు. స్మార్ట్ఫోన్ ఉన్న రైతులు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.