W.G: కోవిడ్ సంక్షోభంలో దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవడంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎంతో కష్టపడ్డారని మంత్రి పయ్యావుల కేశవ్ కొనియాడారు. ఆదివారం పీఎం లంకలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కూటమికి ప్రజలు వేసిన ఓటు వల్లే అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు వస్తున్నాయని తెలిపారు. రక్షణ, ఆర్థిక శాఖల బాధ్యతలను ఆమె సమర్థంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.