GNTR: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో AIYF వినూత్న నిరసన చేపట్టింది. కొత్తపేట భగత్‌సింగ్ బొమ్మ సెంటర్ వద్ద బిక్షాటన చేసి, మెడకు ఉరితాళ్లు బిగించుకొని ఆందోళన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకపోతే జనవరి 30న ఛలో విజయవాడ చేపడతామని నాయకులు హెచ్చరించారు.