BHPL: జిల్లా కేంద్రంలో ఆదివారం పారిశ్రామిక వేత్త రతన్ టాటా 88వ జయంతి వేడుకలు BSR అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రతన్ టాటా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వ్యాపార రంగంలోనే కాక సేవ, విలువలు, నిజాయితీతో దేశానికి మార్గదర్శిగా నిలిచిన మహానుభావుడు రతన్ టాటా అని వారు కొనియాడారు.