EG: పోలవరం ప్రాజెక్ట్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కోరుతూ కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆదివారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పట్టణంలో సేకరించిన 200 మంది సంతకాల పత్రాన్ని అందజేసినట్లు మద్దెల సత్యనారాయణ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడికి తగిన గౌరవమని పేర్కొన్నారు.