AP: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశానికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు తెచ్చే విద్య, క్రీడలపై యువత దృష్టి పెట్టాలని సూచించారు. పెదమైనవానిలంక ఉన్నత పాఠశాలలో రూ.18 లక్షల విలువైన కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్ తదితర మౌలిక సదుపాయాలను ఆమె ప్రారంభించారు. తీరప్రాంత యువత ఉన్నత చదువులు చదివి దేశానికి, రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని కోరారు.