KMR: పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. క్యాంప్‌కు వచ్చిన మండల ప్రజలకు గుండెకు సంబంధించిన వైద్యులు పరిశీలించి ఈసీజీ పరీక్షలు, బీపీ,షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అవసరమగు మందులను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, వైద్య బృందం ఉన్నారు.