AP: పేదల ఇళ్లపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ హయాంలో కట్టిన ఇళ్లను.. చంద్రబాబు నిర్మించినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అమరావతిలో ప్యాలెస్ కట్టుకునే ఆలోచన తప్ప.. పేదల ఇళ్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Tags :