AP: పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసాపురం మండలంలోని తాను దత్తత తీసుకున్న పేదమైనవారి లంక గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆమెతో కలిసి మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని ప్రసంగాన్ని విన్నారు.