JN: తరిగొప్పులలో కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు పండుగ కనకయ్య కాంగ్రెస్ శ్రేణులకు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి నిరసిస్తూ నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు.