EG: నల్లజర్ల(M) చోడవరం ఫ్లెక్సీ వద్ద మేక బలి కేసులో బెయిల్పై విడుదలైన ఏడుగురు కార్యకర్తలను మాజీ హోంమంత్రి తానేటి వనితను కలిశారు. పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. YCP శ్రేణులపై అక్రమ కేసులు పెడుతూ కూటమి ప్రభుత్వం భయాందోళనకు గురిచేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలిచి న్యాయపోరాటం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.