MDK: మనోహరాబాద్ మండలం కాళ్ళకల్కు చెందిన పురం మహేష్ ముదిరాజ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మహేష్ కొద్ది నెల క్రితం బీజేపీలో చేరారు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి సమక్షంలో తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఆయనతోపాటు ముప్పిరెడ్డిపల్లి వార్డు సభ్యులు సత్యనారాయణ బిఆర్ఎస్లో చేరారు.