SRD: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి దామోదర రాజనరసింహ విమర్శించారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ చిత్రపటాలతో గ్రామ గ్రామాన నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామీణ పేదలకు భరోసాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కాపాడుతామని, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.