NLG: డిపో నుంచి కనగల్ మండలం దోరేపల్లి, పగిడిమర్రి, శాబ్దుల్లాపురం, రేగట్టే గ్రామాలు, చండూరు, మాల్ మండలాల మీదుగా HYDకు వెళ్లే బస్సు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. బస్సు సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.