వరంగల్ నగర శివారు ORR రక్తసిక్తమవుతోంది. ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారని సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుని 329 మంది లైసెన్సులు సస్పెండ్ చేశామని, 887 మందికి జైలు శిక్ష విధించామని తెలిపారు. సైబర్ మోసాల్లో బాధితులు రూ.12.42 కోట్లు కోల్పోగా, రూ. 61.93 లక్షలు రికవరీ చేశామని పేర్కొన్నారు.