WGL: మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ చివరి దశకు చేరుకున్నా, AAIకి చెందిన 706 ఎకరాల్లో 9.86 ఎకరాలు కబ్జా అయింది. ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్ శివారు బెస్త చెరువు కాలనీ పరిసరాల్లో ఇళ్ల నిర్మాణాలు ఉండడంతో ఏఏఐ హైదరాబాద్ జనరల్ మేనేజర్ నటరాజు, డైరెక్టర్ వీవీ రావు రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. కబ్జాల తొలగింపు కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.