HYD: “చెక్ మేట్” కన్సల్టెన్సీ పేరుతో వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ సంస్థ అధినేత హేమ రోహిత్ అలియాస్ చిన్నూను అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో, విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తామని నమ్మించి ఈ ముఠా భారీగా వసూళ్లకు పాల్పడింది.