MDK: సీఎం, మాజీ సీఎంలకు సబ్జెక్ట్ లేక బూతులు మాట్లాడుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. అసలు ఆ భాష ఏంటి.? మీ ఇద్దరి భాషతో రాజకీయ నాయకుల మీద ప్రజలకు గౌరవం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ను ప్రజలు పట్టించుకోవడం లేదని, దేశంలో ఎన్నికలు జరిగితే ఒక్కొక్క రాష్ట్రాన్ని కాంగ్రెస్ కోల్పోతుందని తెలిపారు.