ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరిలో, వెనుక కూర్చున్న మహిళ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె కాళ్లపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.