కృష్ణా: నాగాయలంక SI కె. రాజేష్ ఆధ్వర్యంలో వక్కపట్టవారి పాలెంలో ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ శనివారం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఐఎస్ఐ మార్క్ ఉన్న నాణ్యమైన హెల్మెట్ ప్రాణ రక్షణకు ఎంత కీలకమో వివరించారు. పలువురిని అక్కడికక్కడే ఐఎస్ఐ హెల్మెట్లు కొనుగోలు చేయించారు.