KMR :బాన్సువాడ పట్టణంలో శుక్రవారం రాత్రి హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ముష్కరుల దిష్టిబొమ్మ దహనం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆర్య సమాజ్ మందిరం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.