TG: ఖమ్మం జిల్లాలో Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభించారు. విద్యుత్ హైటెన్షన్ తీగల తొలగింపుతో 6వేల మంది గ్రామీణ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పొంగులేటి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో రూ.8 కోట్లతో విద్యుత్ పనులకు ప్రారంభించామన్నారు. ఏప్రిల్లో రెండో విడత ఇళ్లు ఇస్తామని తెలిపారు.