ప్రకాశం: మార్కాపురం జిల్లా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి మండలంలోని గోగులదిన్నె వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టు కార్యాలయాలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన వసతులు, స్థలావకాశాలను ఆయన సమీక్షించారు. జిల్లా పరిపాలన సక్రమంగా సాగేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.