BDK: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాల్వంచ మండలం సోములగూడెం ఇండిపెండెంట్ సర్పంచ్‌గా ఎన్నికైన కెలోత్ సునీత కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ జెండా కప్పుకొని పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు సర్పంచ్ తెలిపారు.