HNK: కాజీపేట మండలం సోమిడిలో శనివారం పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం మాజీ అధ్యక్షుడు మేకల కేదారి యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా అందచేస్తున్న నట్టాల నివారణమందులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.