కృష్ణా: మచిలీపట్నంలోని నేషనల్ కాలేజ్ మైదానంలో నిర్వహిస్తున్న ఓల్డ్ క్రికెటర్స్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ను మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాలుగా కాలేజీ నిర్వాహకులు టోర్నమెంట్ను నిర్వహిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.