MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ ప్రాంతంలో నూతన కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణానికి హైకోర్టు జస్టిస్ ఎన్.శ్రవణ్ కుమార్ వెంకట్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి పాల్గొన్నారు.