KMM: మధిర మండలంలో వివిధ గ్రామాలలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జీవాలకు ఉచిత నట్టల నివారణ వైద్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. బుచ్చిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ రామకృష్ణ, ఖమ్మంపాడు దెందుకూరు గ్రామాలలో గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందులు పశు వైద్య సిబ్బంది పంపిణీ చేశారు. పేద రైతులకు మేలు చేయాలని జీవాలకు మందులు పంపిణీ చేస్తున్నామన్నారు.