NDL: డోన్ మండలం గుండాల గ్రామంలో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పంప్ హౌస్, లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. ఈ పథకం ద్వారా కొత్త బురుజు, చిన్న పుద్దిళ్ల గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. దీంతో రైతుల సాగునీటి కష్టాలు తీరి, వ్యవసాయాభివృద్ధి జరుగుతుందని కోట్ల పేర్కొన్నారు.