GNTR: అమరావతి రైతు రామారావు మృతిపై CPI నేత నారాయణ ఇవాళ తీవ్రంగా స్పందించారు. మందడంలో గుండెపోటుతో చనిపోయిన ఆ రైతు మరణం ముమ్మాటికీ ‘ప్రభుత్వ హత్యే’ అని ఆయన ఆరోపించారు. 15 ఏళ్లు గడుస్తున్నా రైతుల సమస్యలను పరిష్కరించకపోవడం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయని, ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆ పాపం పాలకులకే చుట్టుకుంటుందని నారాయణ హెచ్చరించారు.