ELR: గణపవరం మండలం జల్లికొమ్మరకు చెందిన కవల కోదండ రాంబాబు TDP జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ MLA గన్ని వీరాంజనేయులుకు ధన్యవాదాలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని, ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూస్తానని రాంబాబు స్పష్టం చేశారు.