E.G: దేవరపల్లి గ్రామ టీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన తంగళ్ల సూరిబాబు శెట్టిబలిజ యూత్ సభ్యులతో కలిసి శనివారం రాత్రి పార్టీ నాయకుడు గన్నమని హరికృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని హరికృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరి నోమేంద్ర రామారావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.