ASF: కాగజ్నగర్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద చైనా మాంజా విక్రయిస్తున్న ఓ దుకాణంపై సీసీఎస్ పోలీసులు దాడి చేసి నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో రూ. 26,400 విలువైన చైనా మాంజాను పట్టుకున్నారు. షాపు యజమాని అబ్దుల్ వాజీద్(42)పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.