SKLM: వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇవాళ మంత్రి టెక్కలిలో ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాలపై ఆలయ కమిటీ సభ్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.