NZB: పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ఎంతో అవసరమని అటవీ శాఖ సెక్షన్ అధికారి బాసిత్ అన్నారు. మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు అడవులను కాపాడాలని, వన్యమృగాలకు హాని తలపెట్టకూడదని సూచించారు.