PPM: గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ప్రత్యేక అధికారి ఆదేశాలు మేరకు పాచిపెంట మండలం పి.కొనవలస సచివాలయం సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు ఎంపీడీవో బివిజె పాత్రో శుక్రవారం తెలిపారు. ప్రతి రోజూ టైమ్‌కు అటెండెన్స్ వేయకపోవడం, గ్రామం స్వచ్భంగా లేకపోవడం, వాట్సప్ గవర్నర్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటంతో మెమోలు జారీ చేశామని పేర్కొన్నారు.