KMM: జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శని, ఆదివారాల్లో పర్యటించనున్నారని మంత్రి కార్యాలయం తెలిపింది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు దమ్మపేట మండలం పూసుకుంటలో, ఆదివారం ఉదయం 10 గంటలకు సత్తుపల్లి మండలం గంగారంలో నిర్వహించే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నారు.