SKLM: జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఉ.10.30గం.లకు జిల్లా అభివృద్ధి సమన్వయం, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధిత సభ్యులు, అధికారులు హాజరు కావాలని కోరారు.