NTR: విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో సీఐగా వెంకటరమణ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆయన మాచవరం పోలీస్ స్టేషన్కు సీఐగా నియమితులై అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సీఐ వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, చట్టసువ్యవస్థల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని తెలిపారు.