BPT: చీరాలలో మద్యం మత్తులో హల్చల్ సృష్టించిన వేటపాలెం ఏఎస్సైపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ, సంబంధిత ఏఎస్సైను తక్షణమే వీఆర్‌కు పంపించారు. పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని, క్రమశిక్షణకు భంగం కలిగిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.