AP: దివంగత కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వర్థంతి నేడు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘వంగవీటి పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా నివాళులు’ అంటూ ట్వీట్ చేశారు.