అన్నమయ్య: పీలేరులోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO శివశంకర్ తెలిపారు. MPP కంభం సతీష్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు జరిగే సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.