BDK: తెలంగాణ రాజ్యాధికార పార్టీ పినపాక మండల అధ్యక్షుడిగా గాండ్ల అశోక్‌ను ఆ పార్టీ ప్రకటించింది. పినపాక మండలం జానంపేటకి చెందిన గాండ్ల అశోక్ ఇటీవల బీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ తనను మండల అధ్యక్షుడుగా నియమించడం పట్ల ఆయన పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్నకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల రాజ్యాధికారం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.