ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల తహసీల్దారుగా 5 నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన దామెర వెంకటేశ్వర రావు డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి పొందారు. నిబద్ధత, కృషి, ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావం వల్లే అనతికాలంలోనే పదోన్నతి వచ్చిందని తోటి ఉద్యోగులు, మండల ప్రజలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.