KRNL: ఎమ్మిగనూరు–ఆదోని ప్రధాన రోడ్డులో ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గురువారం సాయంత్రం డీఎస్పీ భార్గవి, రూరల్ సీఐ చిరంజీవి పరిశీలించారు. కోటేకల్ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన వారిని డీఎస్పీ పరామర్శించారు. ప్రమాదాల నివారణకు యాక్సిడెంట్ జోన్లలో డేంజర్ బోర్డులు, ఇండికేటర్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సీఐ చిరంజీవిని ఆదేశించారు.