NLR: ఆత్మకూరులోని 4వ వార్డు ప్రజలు గురువారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వినతిపత్రం అందించారు. తమ ప్రాంతంలో మురికి కాలువలు లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం చేసుకున్న ప్రాంతంలో నీరు రోడ్లపై నిలిచి ఇబ్బందులు పడుతున్నామని, సైడు కాలువలు నిర్మించాలని కోరారు. ప్రజల సమస్యను పరిశీలించి, తప్పకుండా పరిష్కరిస్తానని మంత్రి ఆనం హామీ ఇచ్చారు.