NZB: కమ్మర్పల్లి మండలం రాజరాజేశ్వరి నగర్ గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాల గంగాధర్ (70) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కారు వెనక నుంచి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది గంగాధర్‌ను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.