దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ్టి నుంచి సీఎస్ల 5వ జాతీయ సదస్సు జరగనుంది. మూడు రోజులపాటు జరగనున్న సదస్సుకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సదస్సుకు ఎంతో ప్రాధాన్యం ఉంది.